Realme GT 2 Pro ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్

by Disha Web Desk 17 |
Realme GT 2 Pro ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్
X

దిశ,వెబ్‌డెస్క్: Realme ఇండియాలో మరొ రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 7న GT 2, GT 2 Pro ను విడుదల చేయనుంది. Realme GT 2, Realme GT 2 Pro లో Snapdragon 8 Gen 1 చిప్‌సెట్, అధునాతన మెట్రిక్ సిస్టమ్, Dolby Atmos డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ పేపర్ వైట్, పేపర్ గ్రీన్, స్టీల్ బ్లాక్, టైటానియం బ్లూ కలర్ ఆప్షన్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది.

Realme GT 2:

Realme GT 2.. 12GB RAM 256GB మెమరీతో వస్తుంది.

6.62-అంగుళాల పూర్తి-HD + E4 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3.0 పై రన్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 SoC, 12GB RAM అమర్చబడింది.

ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీల కోసం, ఇది 16MP ఫ్రంట్ కెమెరాని కలిగి ఉంది.

ఇది 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.



Realme GT 2 Pro :

6.7-అంగుళాల 2K AMOLED LTPO 2.0 డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్,1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

Realme GT 2 Pro ఫోన్ Android 12 ఆధారిత Realme UI 3.0పై పనిచేస్తుంది.

Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో గరిష్టంగా 12GB RAM 512GB వరకు మెమరీతో వస్తుంది.

కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ Sony IMX766 సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్ 150-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ కెమెరా,2MP మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ 5000mAh, ఇది 65W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఇండియాలో Realme GT 2, GT 2 Pro ధరల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed