చైనాలో 'రియల్ లైఫ్ సర్వైవల్ గేమ్'

by Muthe.Rajitha |

చైనాలోని దయాంగ్ పర్వత ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

చైనాలో రియల్ లైఫ్ సర్వైవల్ గేమ్
X

దిశ, వెబ్ డెస్క్ : చైనాలోని దయాంగ్ పర్వత ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పర్వత శిఖరాల నుంచి పదునైన భారీ మంచు గడ్డలు (ఐస్ కోన్స్) వేలాడుతూ ఉండటంతో అక్కడికి వెళ్లే పర్యాటకులు తీవ్ర ప్రమాదంలో పడుతున్నారు. ఎప్పుడైనా ఆ మంచు గడ్డలు కింద పడే అవకాశం ఉండటంతో, వాటి కింద నడవడం చాలా ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన నెటిజన్లు దీనిని ‘రియల్ లైఫ్ సర్వైవల్ గేమ్’గా వ్యాఖ్యానిస్తున్నారు. క్షణం ఏమరపాటు జరిగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఒకవైపు ప్రకృతి అందం ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు అంతటి భయానక ముప్పు దాగి ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రదేశాన్ని కొంతకాలం మూసివేయాలని డిమాండ్స్ కూడా వస్తున్నాయి.

Next Story