- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఓఆర్‌ఆర్ పై రాంగ్ రూట్‌లో వచ్చిన రెడీ మిక్స్ వాహనం
by Batti.Sumithra |
రెడీ మిక్స్ వాహనం శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఎంట్రీ నుంచి లోపలికి రాంగ్ రూట్‌లో రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

X
దిశ, శంషాబాద్: రెడీ మిక్స్ వాహనం శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఎంట్రీ నుంచి లోపలికి రాంగ్ రూట్‌లో రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. దీనికి సంబంధించిన వివరాలను బాధితుడు తెలిపిన ప్రకారం.. ఓ వ్యక్తి కారులో శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళ్లేందుకు ఓఆర్‌ఆర్‌పైకి ప్రవేశించిన వెంటనే మలుపు తిరుగుతున్న సమయంలో ఎదురుగా ఒక రెడీ మిక్స్ వాహనం అకస్మాత్తుగా రాంగ్‌సైడ్‌లో రావడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
Next Story






