- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహపూర్వక పరుగు పందానికి సర్వం సిద్ధం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో RDF విద్యాసంస్థల ఆధ్వర్యంలో 5k రన్ నిర్వహించనున్నారు.

దిశ పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో స్వామి వివేకానంద జయంతి మరియు సేవా లాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్డీఎఫ్ విద్యా సంస్థల నిర్వాహకులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో రేపు మహా శివరాత్రి రోజున ఐదు కిలోమీటర్ల స్నేహ పూర్వక పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఆర్డీఎఫ్ కళాశాల, కల్లెడ నుండి ప్రారంభమై పర్వతగిరిలోని పర్వతాల శివాలయం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలకు నమోదు (రిజిస్ట్రేషన్) కార్యక్రమం రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమై 7గంటలకు ముగుస్తుందని,ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కటకం మురళీధర్,డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రిటైర్డ్) ముఖ్య అతిథిగా ప్రొ.అజ్మీరా సీతారాం నాయక్, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు మాజీ ఎమ్మెల్యే, కల్లెడ సర్పంచ్ తక్కెళ్లపల్లి శ్రీనివాస్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్ హాజరవుతున్నారని తెలిపారు.
మహిళలకు, పురుషుల కు విడివిడిగా పోటీలు నిర్వహిస్తామని గెలుపొందిన మొదటి వందమంది మహిళలకు, వందమంది పురుషులకు వెయ్యి రూపాయల చొప్పున బహుమతిగా అందజేస్తామని తెలిపారు. కావున పోటిలో పాల్గొనే వారు సకాలంలో చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.






