WPL... గుజరాత్ పై RCB ఘన విజయం

by Muthe.Rajitha |

WPL 2026 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది.

WPL... గుజరాత్ పై RCB ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడు కొనసాగుతోంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. వడోదర వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. గౌతమి నాయక్‌ 73 పరుగులతో అద్భుతంగా రాణించగా, రిచా ఘోష్‌ 27, స్మృతి మంధాన 26 పరుగులతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ జెయింట్స్‌ ఆర్సీబీ బౌలర్ల ధాటికి కట్టడి కాలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులకే పరిమితమైంది. గుజరాత్‌ తరఫున ఆష్లే గార్డెనర్‌ 54 పరుగులతో ఒంటరి పోరాటం వృథా అయింది. బెంగళూరు బౌలర్లలో సయాలి సత్గరే మూడు వికెట్లు, నాదిన్‌ డిక్లెర్క్‌ రెండు వికెట్లు తీశారు. లారెన్‌ బెల్‌, రాధా యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ తలో వికెట్‌ తీసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.

Next Story