- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేతులు మారనున్న RCB
ఐపీఎల్ లోని అత్యధిక అభిమానులున్న ఫ్రాంచైజీ RCB యాజమాన్యం చేతులు మారే అవకాశాలున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ లోని అత్యధిక అభిమానులున్న ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం చేతులు మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఓనర్ డియోజీయోకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) సంస్థ గత నవంబర్ నుంచే RCB ని అమ్మకానికి పెట్టింది. ఈ ప్రక్రియ రానున్న మార్చి 31 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. RCB ఫ్రాంచైజీ విలువ సుమారు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్లు(రూ.12,500 నుంచి రూ.17,000 కోట్లు)గా అంచనా వేస్తున్నారు.
కాగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అడార్ పూనావాల్లా RCB కోసం బిడ్ వేస్తానని అధికారికంగా ప్రకటించారు. హోంబలే ఫిల్మ్స్‌తో పాటు నిఖిల్ కామత్, అదానీ గ్రూప్, JSW వంటి పెద్ద సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓనర్ మారితే టీమ్ పేరు మారుతుందో లేదో క్లారిటీ లేదు. కానీ మేనేజ్‌మెంట్, టీమ్ వ్యూహం, ఆటగాళ్ల ఎంపికలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






