ట్రావిస్ హెడ్ భార్యను రేప్ చేస్తామని బెదిరిస్తున్న ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-25 04:54:33  IST  )

ట్రావిస్ హెడ్ భార్య జెస్సికాకు కొందరు ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ రేప్ బెదిరింపులు ఇచ్చారు. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రావిస్ హెడ్ భార్యను రేప్ చేస్తామని బెదిరిస్తున్న ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఈ నెల 22న ఉప్పల్ వేదికగా జరిగిన SRH vs RCB మ్యాచ్‌లో సన్ రైజర్స్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ (Virat Kohli), ట్రావిస్ హెడ్ మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ.. ట్రావిస్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం సోషల్ మీడియాకు పాకింది. దీంతో సన్ రైజర్స్ అభిమానులు కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లోని పోస్టుల కింద మొత్తం హెడ్ పోస్టులతో నింపేశారు. దీంతో ఆగ్రహించిన ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు (RCB and Kohli fans) అతనితో పాటు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు హెడ్ భార్య ఫోటోలను చూడటానికి వీలు లేకుండా ఎడిట్, మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరికొంతమంది ఇంకాస్త ముందుకెళ్లి ట్రావిస్ హెడ్ (Travis Head) భార్యను రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆర్సీబీ, కోహ్లీ అభిమానులపై ఇతర జట్ల అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు, ట్రోలింగ్‌కు కూడా హద్దులు ఉంటాయని, ప్లేయర్ల కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారిపై కూడా ఆర్సీబీ అభిమానులు ఎదురుదాడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ, కోహ్లీ అభిమానులు చేస్తున్న హంగామా పై స్పందించిన ట్రావిస్ హెడ్ భార్య.. తనపై దాడులు చేస్తామని బెదిరింపులతో పాటు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల పై ట్రోల్స్ చేస్తున్నారని ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా హెడ్ ఆవేదన వ్యక్తం చేసింది.

పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్.. శ్రేయ‌స్ అయ్య‌ర్ సోద‌రిపై ట్రోల్స్‌

Next Story