పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్.. శ్రేయ‌స్ అయ్య‌ర్ సోద‌రిపై ట్రోల్స్‌

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయింది.

పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్.. శ్రేయ‌స్ అయ్య‌ర్ సోద‌రిపై ట్రోల్స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఎలిమినేట్ అయింది. ఒక్క పాయింట్ అంటూ ఈ టోర్నమెంట్ లో కేకేఆర్ ను ట్రోల్ చేసిన పంజాబ్ కింగ్స్, అదే సింగిల్ పాయింట్ తో టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆదివారం ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన నేపథ్యంలో 16 పాయింట్లు దక్కించుకొని.. ప్లే ఆఫ్స్ కు చేరింది రాజస్థాన్ రాయల్స్. అటు పంజాబ్ కింగ్స్ ఖాతాలో 15 పాయింట్లు మాత్రమే ఉండడంతో ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

వరుసగా 6 విక్టరీలు నమోదు చేసిన సమయంలో ఎగిరి గంతేసిన శ్రేష్ట... ఇక ఇప్పుడు ఇంటికి వెళ్లి ఆడుకోవాల్సిందే అంటూ దారుణంగా ట్రోల్స్ మొదలెట్టారు. ఆమె గతంలో పంజాబ్ గెలిచినప్పుడు ఎగిరి గంతేసిన వీడియోలను వైరల్ చేస్తూ.. ఇక ఇప్పుడు ఏం చేస్తావ్ అంటూ ఆమెను ఆడుకుంటున్నారు. వర్షం కారణంగా కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా పంజాబ్ తో పాటు కేకేఆర్ కు చెరో పాయింట్ దక్కింది. ఈ సందర్భంగా మా పంజాబీలు చాలా మంచివాళ్లు... అందుకే కేకేఆర్ కు ఒక పాయింట్ దానం చేశామని శ్రేష్ట‌ వివాదాస్పద రీల్ వదిలారు. అక్కడి నుంచి మొదలైన పంజాబ్ కింగ్స్ పతనం... ఎలిమినేట్ దాకా వచ్చింది. ఈ క్రమంలోనే శ్రేష్ట అయ్యర్ ను దారుణంగా ఆడుకుంటున్నారు.

Next Story