- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్సీబీ.. తొక్కిసలాట మృతులకు స్టేడియం వద్ద మెమోరియల్ ఏర్పాటు
ఆర్సీబీ విజయోత్సవాల్లో మరణించిన 11 మంది అభిమానులకు నివాళిగా మెమోరియల్ ఏర్పాటు. నేటి మ్యాచ్‌లో నల్ల బ్యాండ్లతో ఆడనున్న ఆటగాళ్లు. 11 సీట్లు ఖాళీ.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 కు ముందు ఆర్బీబీ జట్టు ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకుంది. గత ఏడాది జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) గెలుపు వేడుకల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఘనంగా నివాళులర్పించింది. వారి జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియం వద్ద ప్రత్యేకంగా ఒక 'మెమోరియల్'ను ఏర్పాటు చేసింది. ఈ విషాద ఘటనను గుర్తు చేసుకుంటూ నేడు జరగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు తమ చేతికి నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగనున్నారు. తమ జట్టుపై ప్రాణాలు వదిలేంత అభిమానాన్ని చూపిన ఆ 11 మందిని స్మరించుకుంటూ ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా, ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ ఆ 11 మంది అభిమానుల కోసం స్టేడియంలో 11 సీట్లను ఖాళీగా ఉంచాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఆటగాళ్లందరూ 11వ నంబర్ జెర్సీలను ధరించి తమ సానుభూతిని ప్రకటించారు. మైదానంలో ఆటగాళ్లు మాత్రమే కాదు, యావత్ అభిమాన లోకం కూడా ఆ 11 మంది మృతులకు నివాళులర్పిస్తూ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన మెమోరియల్ సందర్శిస్తున్నారు. ఈ చర్య ద్వారా ఆర్సీబీ తన అభిమానుల పట్ల ఉన్న గౌరవాన్ని, బాధ్యతను చాటుకుంది. కాగా మరికొద్ది సేపట్లో 2026 సీజన్ మొదటి మ్యాచ్ బెంగళూరు వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగనుంది.






