- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొత్త ఆదేశాలు జారీచేసిన ఆర్‌బీఐ !

దిశ, వెబ్‌డెస్క్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లో కొత్త వినియోగదారులను చేర్చుకునే ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం ఆదేశాలను జారీ చేసింది. బ్యాంక్ తన ఐటీ వ్యవస్థలో సమగ్రమైన ఆడిట్ నిర్వహించడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని కూడా ఆదేశించింది. పేటీఎం పేమెంట్ బ్యాంకులో కొన్ని సూపర్‌వైజరీ బాధ్యతలకు సంబంధించి ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ తెలిపింది. ఐటీ ఆడిటర్ల రిపోర్టులను సమీక్షించిన తర్వాతే కొత్త వినియోగదారులను చెర్చుకునేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక అనుమతిని ఇస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949, సెక్షన్ 35ఏ కింద తాజా చర్యలు తీసుకున్నామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా, 2016 లో పేటీఎం సంస్థ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2017లో కార్యకలాపాలను ప్రారంభించింది. పేటీఎం వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మ ప్రస్తుతం ఈ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు. 2021, మార్చి చివరి నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మొత్తం 6 కోట్లకు పైగా అకౌంట్లు ఉండగా, రూ. 5 వేల కోట్లకు పైన డిపాజిట్లు ఉన్నాయి. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద యూనిఫైడ్ ఇంటర్‌ఫేస్ బెనిఫిషియరీ బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.