ధోనీతో విభేదాల వార్తలపై స్పందించిన రవీంద్ర జడేజా

by Malleboina Mahesh |

ధోనీతో విభేదాల వార్తలపై స్పందించిన రవీంద్ర జడేజా. రీయూనియన్‌లో మాట్లాడుకోకపోవడానికి సాంకేతిక కారణాలేనని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టత.

ధోనీతో విభేదాల వార్తలపై స్పందించిన రవీంద్ర జడేజా
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28 ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో ఎంతో మంది కీలక ప్లేయర్లు పాత జట్లను వదిలి కొత్త జట్లకు వెళ్లాల్సి వచ్చింది. వారిలో రవీంద్ర జడేజా కూడా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా చెన్నై తరఫున ఆడిన ఆయన యాజమాన్యం నిర్ణయంతో రాజస్థాన్ జట్టులోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నిర్వహించిన పాత- కొత్త ఆటగాళ్ల రీయూనియన్ వేడుకలో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వీరిద్దరి మధ్య మళ్ళీ 'కోల్డ్ వార్' మొదలైందని, విభేదాలు ఉన్నాయని వార్తల వస్తున్నాయి. అటువంటి వర్తాలపై జడేజా తాజాగా స్పందించారు. తామిద్దరం మాట్లాడుకోకపోవడానికి కారణం కేవలం సాంకేతిక ఇబ్బందులు, రద్దీ మాత్రమే తప్ప, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ఆ రీయూనియన్‌కు వెళ్లే ముందే 'మహీ భాయ్' ఎక్కడున్నారో కనుక్కుందామని ఫోన్ చేశానని, కానీ ఆ సమయంలో ఆయన ఫోన్ స్విచాఫ్ వచ్చిందని జడేజా వివరించారు. వేదిక వద్ద కూడా విపరీతమైన రద్దీ ఉండటం, వేర్వేరు కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల మాట్లాడుకునే అవకాశం దక్కలేదని తెలిపారు. ధోనీ తనకు ఎప్పుడూ గురువు, మార్గదర్శి అని, ఇలాంటి చిన్న విషయాలను పెద్దవి చేయవద్దని ఆయన అభిమానులను కోరారు. గతంలో 2022లో విభేదాలు వచ్చాయన్న వార్తలకు 2023 ఫైనల్ విజయంతోనే తెరపడిందని ఈ సందర్భంగా రవీంద్ర జడేజా గుర్తు చేశారు.

Next Story