భారత టీ20 జట్టులోకి రవి బిష్ణోయ్ రీ-ఎంట్రీ

by Malleboina Mahesh |

జింబాబ్వే టీ20 సిరీస్ కోసం భారత జట్టులోకి రవి బిష్ణోయ్ రీ-ఎంట్రీ.. గాయపడిన వరుణ్ చక్రవర్తి స్థానంలో ఎంపిక!

భారత టీ20 జట్టులోకి రవి బిష్ణోయ్ రీ-ఎంట్రీ
X

దిశ, వెబ్ డెస్క్: యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) టీమిండియా లోకి రీ-ఎంట్రీ ఇవ్వడంపై అధికారికంగా ఫిక్స్ అయింది. జింబాబ్వేతో జరగబోయే రాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆయనను భారత జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా సీనియర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గ్రేడ్-2 హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురై జట్టుకు దూరమ్యారు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ చర్చించి, వరుణ్ చక్రవర్తి స్థానంలో రవి బిష్ణోయ్‌ను రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి తీసుకున్నారు.

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో) బిష్ణోయ్ 4 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, వరుణ్ చక్రవర్తి గాయపడటంతో బిష్ణోయ్‌కు సెలెక్టర్లు మరో లైఫ్‌లైన్ ఇచ్చారు. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు గాయపడిన పేసర్ హర్షిత్ రాణా స్థానంలో ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కోసం యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను ఎంపిక చేశారు.

Next Story