పాక్ వైమానిక దాడులపై రషీద్ ఖాన్ ఫైర్.. పౌరుల మృతిపై ఐక్యరాజ్యసమితికి కీలక విన్నపం!

by Malleboina Mahesh |   (  Updated:2026-03-17 03:40:02  IST  )

కాబూల్‌పై పాక్ దాడులను 'యుద్ధ నేరం'గా అభివర్ణించిన రషీద్ ఖాన్. రంజాన్ మాసంలో పౌరుల మృతిపై ఆవేదన; విచారణ జరపాలని ఐక్యరాజ్యసమితికి విన్నపం.

పాక్ వైమానిక దాడులపై రషీద్ ఖాన్ ఫైర్.. పౌరుల మృతిపై ఐక్యరాజ్యసమితికి కీలక విన్నపం!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని నెలలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పరస్పర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానికదళం.. ఆఫ్ఘనిస్తాన్ లోకి ఓ ఆస్పత్రిపై దాడి చేసింది. ఈ దాడిలో ఏకంగా 400 మంది మృతి చెందగా మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పాక్ దాడిలో మరణించిన వారంతా.. డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో వారికి చికిత్స అందించేందుకు స్థానిక ప్రభుత్వం ఈ ఆస్పత్రిని నిర్వహిస్తుంది. కాగా పాక్ చేసిన ఈ పైశాచిక దాడిపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటరల్ అయిన రషిద్ ఖాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన పాక్ పై ఫైర్ అయ్యాడు.

అర్ధరాత్రి పాకిస్తాన్ చేసి వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల రషీద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. పౌరుల ఇళ్లు, విద్యా సంస్థలు, దా వైద్య మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అది ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా పొరపాటున జరిగినా ఖచ్చితంగా అది 'యుద్ధ నేరం' (War Crime) కిందకే వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో మానవ ప్రాణాల పట్ల కనీస గౌరవం లేకుండా ఇలాంటి దాడులకు పాల్పడటం విచారకరమని, ఇది ప్రజల మధ్య విద్వేషాలను మాత్రమే పెంచుతుందని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘోర కలికంపై ఐక్యరాజ్యసమితి (UN), ఇతర మానవ హక్కుల సంస్థలు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రషీద్ ఖాన్ డిమాండ్ చేశాడు. అలాగే ఈ కష్టకాలంలో తన దేశ ప్రజలకు అండగా ఉంటానని, ఒక జాతిగా తాము మళ్ళీ పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ భారీ దాడి.. 400 మంది మృతి!

Next Story