Rashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నారియాక్షన్ ఇదే.. నా కూడా పిల్లలను కనాలనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-27 14:54:37  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా(Rashi Khanna) ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

Rashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నారియాక్షన్ ఇదే.. నా కూడా పిల్లలను కనాలనే ఉందంటూ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా(Rashi Khanna) ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు ‘సబర్మతి రిపోర్ట్’(Sabarmati Report) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే(Vikrant Massey)హీరోగా నటించగా.. ఇటీవల ట్రైలర్ కూడా విడుదలై మూవీపై హైప్ పెంచేసింది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా(Rashi Khanna) పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘పెళ్లి అనేది నా పర్సనల్ విషయం కాబట్టి దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయాలనుకోవడం లేదు. నాకూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది కానీ దానికి ఇంకా టైమ్ ఉంది. అది నా పర్సనల్ విషయం నా వృత్తితో దాన్ని కలపాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే నేను ప్రకటిస్తా. కానీ రూమర్స్ క్రియేట్ చేయకండి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story