- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

బెంగళూరు: కర్ణాటక హిజాబ్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ ధరించకపోవడం వల్లే స్త్రీలు లైంగిక దాడులకు గురవుతున్నారని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి తెరలేపాయి. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇస్లాంలో హిజాబ్ అంటే పరదా అని అర్థం. స్త్రీల అందాన్ని కప్పి ఉంచడం కోసమే వీటిని ధరిస్తారు. నేడు దేశంలో అత్యధికంగా లైంగిక దాడులు జరగడాన్ని గమనిస్తున్నాం. మీకు దీనికి కారణం ఏంటో తెలుసా? వారు హిజాబ్ ధరించకపోవడం వల్లనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి' అని అన్నారు. అనంతరం తన వ్యాఖ్యలను సమర్థిస్తూ.. 'హిజాబ్ ధరించడం తప్పనిసరి కాకపోయినా, తమను తాము రక్షించుకోవాలనుకునే వారు ధరిస్తారు. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతుంది' అని అన్నారు. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.






