- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్భయ ఘటన రిపీట్.. వికలాంగురాలుపై దారుణంగా అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, దాడులు మాత్రం ఆగడం లేదు అనడానికి

దిశ, వెబ్‌డెస్క్ : మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా, దాడులు మాత్రం ఆగడం లేదు అనడానికి ఎన్నో సంఘటనలు నిదర్శణం. ఇక 2012 నిర్భయ ఘటనను ఎవరూ మర్చిపోలేరు. అయితే తాజాగా అదే ఘటన మరోసారి రిపీట్ అయ్యింది. ఛత్తీస్ గడ్ లో ఓ అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని బాంజ్ గిర్ చంపా జిల్లాలో ఓ ఘటన సంచలనం సృష్టిస్తోంది. రోడ్డుపై గాయలతో పడి ఉన్న అమ్మాయిని చూసి ప్రమాదంలో మరణించదనుకుని విచారణ చేసిన పోలీసులుకు షాక్ తగిలింది. విచారణలో నివురు గప్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానసిక వికలాంగురాలైన మహిళపై ఓ అత్యాచారం చేసి అనంతరం బాధితురాలి జననాంగాలలో ఇనుప రాడ్ ను దూర్చి హింసించాడు ఓ దుర్మార్గుడు. తీవ్రంగా హింసించడంతో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ సంఘటన ఛత్తీస్ గడ్‌లో కలకలం సృష్టిస్తోంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.






