- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ మాజీ క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు నమోదవడం సంచలనం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు నమోదవడం సంచలనం రేపుతోంది. పాక్ క్రికెట్లో లెగ్ స్పిన్ దిగ్గజం అయిన అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సల్మాన్ ఖాదిర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో, లాహోర్‌లోని బార్కీ పోలీస్ స్టేషన్‌లో FIR ఫైల్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్ ను అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల వివరాల ప్రకారం.. సల్మాన్ ఖాదిర్ ఇంట్లో పని చేస్తున్న వర్కర్.. 'సల్మాన్ తనను బలవంతంగా ఫార్మ్‌హౌస్‌కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు' అని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పాకిస్తాన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అబ్దుల్ ఖాదిర్ పాకిస్తాన్ క్రికెట్‌లో గొప్ప లెగ్ స్పిన్నర్‌గా పేరుపొందగా.. ఆయన కుమారునిపై ఇలాంటి ఆరోపణలు రావడం పాకిస్తాన్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.






