హోస్ట్‌ను ముద్దుల్లో ముంచేసిన రణ్‌వీర్.. లైంగిక వేధింపులే అంటూ..

by Disha Web Desk 12 |
హోస్ట్‌ను ముద్దుల్లో ముంచేసిన రణ్‌వీర్.. లైంగిక వేధింపులే అంటూ..
X

దిశ, సినిమా: బాలీవుడ్ రాకింగ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రణ్‌వీర్.. అడవి జంతువుల కంటే భయంకరంగా ప్రవర్తించాడని విమర్శిస్తున్నారు. అడవుల్లో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న ఆ షో హోస్ట్ బేర్ గ్రిల్స్‌కు వైల్డెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇదేనేమో అని కామెంట్ చేస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ ఎపిసోడ్‌లో.. అప్రిసియేషన్‌గా బేర్ గ్రిల్స్‌ను శ్వాస కూడా తీసుకోనివ్వకుండా ముద్దుల్లో ముంచెత్తడమే ఇందుకు కారణం. దీంతో బేర్ గ్రిల్స్ అతనిపై లైంగిక వేధింపుల కేసు పెట్టొచ్చని, డ్యామేజ్ కింద మిలియన్ డాలర్స్ సొమ్ము చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. రణ్‌వీర్‌ను రిహాబిలిటేషన్ సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed