- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
షాపింగ్ మొదలుపెట్టిన లవ్‌బర్డ్స్.. పెళ్లికోసమేనా?

దిశ, సినిమా: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- అలియా భట్ తొందరలోనే పెళ్లి పీఠలెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాదే వీరి వివాహం అవుతుందని అందరూ భావించినా, కొవిడ్‌తోపాటు పలు కారణాల వల్ల వాయిదా పడగా.. ఎట్టకేలకు 2022లోనే మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రాతో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ దర్శనమివ్వడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది.
రణ్‌బీర్, అలియాల పెళ్లి దుస్తుల డిజైన్ కోసమే నీతూను ఆమె కలిసిందని, ఇరువురు షాపింగ్ కూడా చేస్తున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అలియా ఫ్యామిలీ కూడా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టిందని, రణ్‌బీర్ కుటుంబంతో సంప్రదింపులు చేస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక అలియా, రణ్‌బీర్ తొలిసారి కలిసి నటించిన 'బ్రహ్మాస్త్ర' 2022 సెప్టెంబర్ 9న విడుదల కానుంది.