నెలవంక దర్శనం.. రేపటి నుంచి రంజాన్

by Muthe.Rajitha |

సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ ప్రారంభం కానుంది.

నెలవంక దర్శనం.. రేపటి నుంచి రంజాన్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా ముస్లింల అత్యంత పవిత్ర పండగ రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈరోజు షాబాన్ 29వ రోజు కావడంతో రంజాన్ నెలవంక (హిలాల్) కనిపిస్తుందా లేదా అని ముస్లిమ్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే భారత్ లో నెలవంక కనిపించక పోయినా.. పవిత్ర మక్కా మసీదు నెలకొన్న సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో రేపటి నుంచి అధికారికంగా రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. సౌదీ సుప్రీం కోర్టు కూడా రంజాన్ ప్రారంభాన్ని ధృవీకరించింది. భారతదేశంలో సౌదీ ప్రకటనను అనుసరిస్తారు కాబట్టి ఇక్కడ కూడా రంజాన్ మాసం ప్రారంభం అయినట్టేనని... ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు, స్కూళ్ళు, కాలేజీల సమయాల్లో వెసులుబాటు కల్పించారు. అలాగే ఇప్పటికే అన్నిచోట్ల రంజాన్ స్పెషల్ హలీం తయారు కేంద్రాలు వెలిసాయి. రంజాన్ మాసం ఆధ్యాత్మికతో, ఉపవాసం, ప్రార్థనలు, దానధర్మాలు, సహనంతో గడపాల్సిన పవిత్ర కాలం. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదర సోదరీమణులందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం కలగాలని 'దిశ' మీడియా తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.

Next Story