37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

షాజన్ పదంసీ(Shazahn Padamsee) గురించి పరిచయం అక్కర్లేదు.

37 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న రామ్ చరణ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: షాజన్ పదంసీ(Shazahn Padamsee) గురించి పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘ఆరెంజ్’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించి కుర్రాళ్ల హృదయాలు కొల్లగొట్టింది. తన అందం, అభినయంతో రామ్-వెంకటేష్(Ram-Venkatesh) ‘మసాలా’ సినిమాలో కూడా నటించింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు కూడా షేర్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు 37 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వెల్లడించింది. గత మూడేళ్లుగా షాజన్, ఆశిష్(Ashish) అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది. రీసెంట్‌గా ఆమెకు ప్రపోజ్ చేయడంతో యాక్సెప్ట్ చేసింది. ఈ ఫొటోలను షాజన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ఇక కలకాలం నీతోనే. వేచి ఉండలేకపోతున్నా’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రజెంట్ షాజన్(Shazahn Padamsee) పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story