- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NIA కొత్త చీఫ్ గా రాకేష్ అగర్వాల్ నియామకం
by Muthe.Rajitha |
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) కి కొత్త చీఫ్‌గా రాకేష్ అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) కి కొత్త చీఫ్‌గా రాకేష్ అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ 1994 బ్యాచ్‌కు చెందినవారు. ఇప్పటివరకు NIAలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన ఆయనకు ఉగ్రవాదం, జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను విచారించిన అనుభవం ఉంది. కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ (ACC) ఆమోదంతో ఈ నియామకం జరిగింది. రాకేష్ అగర్వాల్ ఇప్పటికే కొంతకాలంగా తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టడంతో NIA కార్యకలాపాలకు మరింత బలం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా రాకేష్ అగర్వాల్ 2028 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
Next Story






