ఎలక్షన్ షెడ్యూల్ విడుదల.. 6 రాష్ట్రాల్లో 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

by Disha Web Desk 17 |
rajyasabha
X

న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ ఆరు రాష్ట్రాలలోని 13 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. పంజాబ్‌లో ఐదు, అసోంలో రెండు, కేరళలో మూడు, హిమచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కోస్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల కానుంది. పోలింగ్ ఈ నెల 31న నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొంది. కాగా అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఈ స్థానాల్లో ప్రస్తుతం ఉన్న సభ్యుల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. నోటిఫికేషన్ విడుదల రోజు నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా, అంటోని(కేరళ), శర్మ(హిమాచల్ ప్రదేశ్), ప్రతాప్ సింగ్, నరేష్ గుజ్రాల్(పంజాబ్) వంటి కీలక నేతల పదవీ కాలం ముగియనుంది. కాగా, సోమవారంతో ఉత్తరప్రదేశ్‌లోనూ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తి కానుంది. వీటి ఫలితాలు విడుదల అవక ముందే రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ వెలువడటం గమనార్హం.




Next Story