దేశంలో రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల పూర్తి షెడ్యూల్

by Malleboina Mahesh |

దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు, 3 రాష్ట్రాల్లోని శాసనమండలి (MLAs కోటా) స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 18న పోలింగ్, పలితాలు

దేశంలో రాజ్యసభ, శాసన మండలి ఎన్నికల పూర్తి షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘం (ECI) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ (Council of States) స్థానాలతో పాటు మూడు రాష్ట్రాల శాసనమండలి (State Legislative Councils) స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం 27 రాజ్యసభ స్థానాలకు (24 ద్వివార్షిక, 3 ఉపఎన్నికలు)అలాగే 3 రాష్ట్రాల శాసన మండలి స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ద్వివార్షిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా 10 రాష్ట్రాల్లోని 24 స్థానాలకు.. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, శాసనసభ్యుల (MLAs) కోటా కింద బీహార్‌లో 9, కర్ణాటకలో 7 మండలి స్థానాలకు ద్వివార్షిక ఎన్నికలు, బీహార్‌లోనే మరో స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

ఈ ఎన్నికలకు సంబంధించిన కీలక తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ జూన్ 1, 2026న ఉదయం 11:00 గంటల నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించడానికి జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు గడువు విధించారు. అనంతరం జూన్ 9న నామినేషన్ల పరిశీలన (Scrutiny) జరుగుతుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. పోటీ అనివార్యమైన స్థానాలకు జూన్ 18, 2026న ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Next Story