- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్-గ్రీస్ 'వ్యూహాత్మక' బంధం.. రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం
భారత్-గ్రీస్ దేశాల మధ్య 'వ్యూహాత్మక' బంధం ఏర్పడింది. ఢిల్లీ వేదికగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గ్రీస్ రక్షణ మంత్రి నికోలాస్ జార్జియోస్ ఎస్. డెండియాస్ మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్-గ్రీస్ (India-Greece) దేశాల మధ్య 'వ్యూహాత్మక' బంధం ఏర్పడింది. ఢిల్లీ వేదికగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh), గ్రీస్ రక్షణ మంత్రి నికోలాస్ జార్జియోస్ ఎస్. డెండియాస్ (Nikolaos Georgios S. Dendias) మధ్య సోమవారం కీలక భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, గ్రీస్‌తో భారతదేశానికి ఉన్న సుదీర్ఘమైన, సమయం పరీక్షించిన భాగస్వామ్యానికి భారత్ అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వం, చట్టబద్ధమైన పాలన వంటి ఉమ్మడి విలువల ప్రాతిపదికన ఇరు దేశాల సంబంధాలు బలోపేతం అవుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
అలాగే 2023లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రీస్ పర్యటన, 2024లో గ్రీస్ ప్రధాని భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి చేరాయని రాజ్‌నాథ్ గుర్తు చేశారు. భద్రత, రక్షణ, ఆర్థిక, భారత్-ఈయూ (India-EU) సంబంధాలపై ఇరు దేశాలు ఉమ్మడి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని వివరించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రీస్ రక్షణ మంత్రి బెంగళూరులోని రక్షణ తయారీ కేంద్రాలను కూడా సందర్శించి, సాంకేతిక సహకారంపై చర్చించనున్నారు.
గ్రీస్‌తో రక్షణ బంధం..
భారత్-గ్రీస్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల భారత్‌కు రక్షణ పరంగా భారీ లాభాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా భూ మధ్యధరా (Mediterranean) ప్రాంతంలో గ్రీస్ ఒక కీలక శక్తిగా ఉంది. గ్రీస్‌తో రక్షణ బంధం బలపడటం వల్ల ఆ ప్రాంతంలో భారత నౌకాదళం తన ఉనికిని చాటుకోవడానికి, చైనా వంటి దేశాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి వీలవుతుంది. అలాగే, అత్యాధునిక రక్షణ సాంకేతికతను పంచుకోవడం ద్వారా స్వదేశీ ఆయుధ తయారీ రంగానికి (Make in India) పెద్దపీట వేసే అవకాశం ఉంది.
కేవలం రక్షణ రంగమే కాకుండా, అంతర్జాతీయ వేదికలపై పరస్పర మద్దతునిచ్చుకోవడానికి ఈ స్నేహం దోహదపడుతుంది. గ్రీస్ ద్వారా ఐరోపా సమాఖ్య (EU) దేశాలతో భారత్ తన వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత మెరుగు పరుచుకోగలదు. తీవ్రవాదం, సముద్రపు దొంగల ముప్పును ఎదుర్కోవడంలో ఇరు దేశాల వాయు, నౌకాదళాల సంయుక్త విన్యాసాలు భవిష్యత్తులో అంతర్జాతీయ భద్రతకు కీలకం కానున్నాయి. కాగా ఈ పరిణామాలపై అంతర్జాతీయ విశ్లేషకులు స్పందిస్తూ.. హర్షం వ్యక్తం చేస్తున్నారు.






