పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా రాజేష్ శ్రీవాస్తవ బాధ్యతలు

by Disha Web |
పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా రాజేష్ శ్రీవాస్తవ బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రాజేష్ శ్రీవాస్తవ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సదరన్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్-I(తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలోని పలు రాష్ట్రాల్లోని సబ్‌స్టేషన్లు, ప్రాజెక్టు)కు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజేష్ శ్రీవాస్తవ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా విధుల్లోకి చేరాడు. 1991లో సీనియర్ ఇంజినీర్‌గా పవర్ గ్రిడ్ లో విధులు నిర్వర్తించాడు. పవర్ ట్రాన్స్‌మిషన్ యొక్క అన్ని రంగాల్లో ఆయనకున్న విశేష అనుభవం కారణంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. సదరన్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్-I బాధ్యతలకు ముందు సదరన్ రీజియన్-1, ఈస్టర్న్ రీజియన్-1, పవర్‌గ్రిడ్ పాట్నాలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశాడు. అంతేకాకుండా బీహార్ గ్రిడ్ కంపెనీ లిమిటెడ్‌లో కూడా పనిచేశాడు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed