భారీ ప్లాన్‌లో జక్కన్న.. మహేష్ తర్వాత ఆ హీరోతోనే..?

by Dishafeatures2 |
భారీ ప్లాన్‌లో జక్కన్న.. మహేష్ తర్వాత ఆ హీరోతోనే..?
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమౌళి సినిమా అంటేనే భారీ క్రేజ్ ఉంటుంది. అందులో తమ అభిమాన హీరో, రాజమౌళి కాంబోలో మూవీ రావాలని ప్రతి హీరో అభిమానులు కోరుకుంటారు. అయితే ఇప్పటికే ప్రభాస్, నాని, రాచ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు ఈ కోరిక తీరింది. చెర్రీ, ఎన్‌టీఆర్ అభిమానులకైతే డబుల్ బోనాంజా కూడా సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబో రెడీ అవుతోంది. ఈ సినిమా నెవ్వర్ బిఫోర్‌కు మించి ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే, తాజాగా రాజమౌళి మూవీ లైనప్ గురించి నెట్టింట ఓ వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. జక్కన్న వరుసగా స్టార్ హీరోలను లైన్‌లో పెట్టేశాడట.

మహేష్‌తో సినిమా పూర్తయిన వెంటనే మరో స్టార్‌తో మూవీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసేశాడని, అది మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనే అంటూ వార్తలు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. బన్నీ కోసం కూడా జక్కన్న పక్క పవర్ ఫుల్, పొలిటికల్ టైప్ కథను రెడీ చేశాడట. ఈ మూవీలో బన్ని ఇప్పటి వరకు కనిపించని రీతిలో, స్టైల్‌లో కనిపించనున్నాడట. అంతేకాకుండా బన్నీతో జక్కన్న భారీ యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చేందుకు జక్కన్న ముహూర్తం ఫిక్స్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed