- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మాట నిలబెట్టుకున్న రాజమౌళి.. అతనితో కలిసి డాన్స్..

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమాలు ఎంత భారీగా ఉంటాయో వాటి విజయం కూడా అంతే భారీగా ఉంటుంది అన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సినిమాకు రాజమౌళి, టీం ఎక్కువగా ప్రమోషన్ ద్వారా హైప్స్ పెంచుతూ వస్తారు. అది సినిమాకి ముందు, సినిమా రిలీజైన తర్వాత కూడా ఈ పరంపర కొనసాగిస్తూనే ఉంటాడు. ఇందులో భాగంగా RRR టీమ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి చిట్ చాట్ ప్రోగ్రాం చేసిన విషయం కూడా మన అందరికి తెలిసిన విషయం. అయితే ఈ సందర్భంగా అనిల్ రాజమౌళి తో కలిసి నాటు నాటు కు స్టెప్పులు వేయాలని ఉందని చెప్పారు. ఈ సందర్భంగా జక్కన్న కచ్చితంగా వేద్దమ్ అని అన్నారు.
RRR సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుండడంతో ఆ టీమ్ సభ్యులు సినిమా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అధ్యక్షతన నిర్వహించిన ప్రోగ్రాం లో దర్శకుడు అనిల్ రావిపూడి తో రాజమౌళి నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసి అక్కడ ఉన్న అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే RRR టీమ్ ఏది చేసినా సోషల్ మీడియా ద్వారా హైప్ పెంచేస్తుంది. అలాగే ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ప్రజలను ఎంతగానో అలరిస్తోంది. కాగా ఈ వీడియోలో, నిర్మాత దిల్ రాజు వేదికపైనే ఉండి అనిల్, జక్కన డాన్స్ చూసి చాలా ఆనందించారు.
#NaatuNaatu song dance by @ssrajamouli garu & @AnilRavipudi Garu at #RRRMovie Success Party#BlockBusterRRR @RRRMovie #RRR #RRRMovie pic.twitter.com/Oqytq6TOQV
— Rajesh Kumar Reddy (@rajeshreddyega) April 4, 2022