రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి: కూనూరు

by S Gopi |

దిశ, రామన్నపేట: ఈ నెల 19న జరిగే రైతు సంఘం యాదాద్రి జిల్లా..Raithu Sangam Mahasabhalu

రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి: కూనూరు
X

దిశ, రామన్నపేట: ఈ నెల 19న జరిగే రైతు సంఘం యాదాద్రి జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని ఆల్ ఇండియా కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఊట్కూరి కృష్ణ, కూనూరు లక్ష్మీనరసింహాలు కోరారు. మహాసభల సందర్భంగా గురువారం మండల కేంద్రములో కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. యాభై సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. సన్నకారు, కౌలు రైతులకు వడ్డీ లేని బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ 69 ప్రకారం ఒకేసారి రుణమాఫీ చేయాలని, ఉపాధి హామీ రోజువారీ కూలీ రేటును రూ. 500లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నర్సింహ్మ, సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్, రైతులు బత్తుల సత్యం, గాలయ్య, కూనూరు గోపాల్, చిందెం మల్లేష్ పాల్గొన్నారు.

Next Story