- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసాపై కీలక అప్డేట్
by Muthe.Rajitha |
రైతు భరోసా రెండో విడత సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా రెండో విడత సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏప్రిల్ 22 లోపు రైతు భరోసా సాయాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మూడో విడత సాయాన్ని ఈనెలాఖరులోగా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్టు సమాచారం. రైతు భరోసా మొదటి విడత సాయాన్ని మార్చి 23న ఒక ఎకరం భూమి ఉన్న రైతులకు రూ.6 వేల చొప్పున అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా రెండవ, మూడవ విడత సాయాన్ని ఏప్రిల్ నెల చివరి వారం వరకు అందించడానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు అంటున్నారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.
Next Story






