- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిశుధ్య పనులు నిర్వహించరా ?
మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు సరిగ్గా నిర్వహించడం లేదు.

దిశ, మహదేవపూర్ : మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు సరిగ్గా నిర్వహించడం లేదు. మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో ప్రధాన రహదారిపైనే వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. గ్రామంలో పలు చోట్ల ఇదే తీరు కనిపిస్తున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. బస్టాండ్ ప్రాంతంలో వర్షపు నీళ్లు నిలుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బస్సులు నిలిచే ప్రాంతం కాబట్టి నిత్యం ప్రయాణికులతో, ప్రైవేట్ వాహనాలతో రద్దీగా ఉండే ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామంలోని ఇతర ప్రాంతంలో ఎలా ఉంటుందో ఆలోచన చేయవచ్చు. రాపల్లికోట గ్రామంలో సైతం ప్రధాన రహదారి వెంట వర్షపు నీళ్లు పడి బురదమయం అవుతుందని గ్రామస్థులు వాపోతున్నారు.
ఎక్కడ వేసిన చెత్త అక్కడే...
మండలంలోని ఇతర గ్రామాల్లో సైతం ప్రధాన రహదారులపై తప్ప మిగతా చోట్ల పారిశుధ్య పనులు నిర్వహించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నిర్వహించాల్సిన పనులు చేయకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యం చెందుతున్నారని ఆందోళన చెందుతున్నారు.






