నైరుతి రుతుపవనాల రాక ఎఫెక్ట్.. ఉదయం వరకు వర్షాలు

by Muthe.Rajitha |

రానున్న ఒకటీ రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నైరుతి రుతుపవనాల రాక ఎఫెక్ట్.. ఉదయం వరకు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : రానున్న ఒకటీ రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో, అలాగే ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో ఈ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి వంటి ప్రాంతాల్లో రాత్రి నుంచే జోరుగా వర్షం పడుతోంది. రాబోయే గంటల్లో ఈ తుఫాను మేఘాలు మరింత విస్తరించి మరికొన్ని జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story