Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!

by Kodari Anjali |

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిశాక రోజురోజుకు వేడి పెరిగిపోతుంది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిశాక రోజురోజుకు వేడి పెరిగిపోతుంది. పగటి పూట కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇక ఈశాన్య రుతుపవనాల వల్ల కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో తేలిక పాటి నుంచి మొదలై.. భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అండ్ తెలంగాణలో వానలు లేవని పేర్కొంది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని.. వెదర్ పూర్తిగా పొడిగా ఉంటుందని వెల్లడించింది. దీంతో వాతావరణం కూడా వేడి పెరుగుతోంది.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.


Next Story