- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాగల మూడు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు
రాగల మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలివేగం గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 15న ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల పల్లి, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ నెల 16 నుండి 18 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు:
ప్రాంతం ఉష్ణోగ్రత(డిగ్రీ సెల్సియస్ లలో)
ఆదిలాబాద్ - 39
భద్రాచలం - 38
హకీంపేట్ - 36.6
దుండిగల్ - 36.3
హన్మకొండ - 36
హైదరాబాద్ - 35.7
ఖమ్మం - 36.2
మహబూబ్ నగర్ - 37
మెదక్ - 37.4
నల్గొండ - 34
నిజామాబాద్ - 36.8
రామగుండం - 36.4
పటాన్చెరు - 34.6
రాజేంద్రనగర్ - 35
హయత్ నగర్ - 35
- Tags
- Rain Alerts
- HMD






