- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain Alert : నేడు ఈ జిల్లాల్లో వర్షం
by Muthe.Rajitha |
ప్రస్తుతం రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు తీవ్రంగా దంచుతుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో ఈదురు గాలులు, వడగళ్లు, పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, ఇదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు వెల్లడించారు.
Next Story






