TG : ఈనెల 22 వరకు వర్షాలు

by Muthe.Rajitha |

వాతావరణ నిపుణుల ప్రకారం.. ఏప్రిల్ 19 నుంచి 22 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

TG : ఈనెల 22 వరకు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజులుగా దంచికొడుతున్న ఎండలు, తీవ్రమైన హీట్ వేవ్‌తో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు ఒక చల్లని కబురు. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఏప్రిల్ 19 నుంచి 22 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు ఇంటీరియర్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ఏప్రిల్ 19 నుంచి 22 వరకు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అయితే, ఏప్రిల్ 23 మరియు 24 తేదీల నుంచి వర్షాలు క్రమంగా తగ్గి, మళ్లీ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసినప్పటికీ, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉష్ణోగ్రతలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవచ్చని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story