- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రైన్ ఆలస్యంతో ఎంట్రెన్స్ టెస్ట్ మిస్.. విద్యార్థికి రైల్వేశాఖ రూ.9 లక్షల పరిహారం
రైల్వే శాఖ నిర్లక్ష్యం ఒక విద్యార్థిని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే శాఖ నిర్లక్ష్యం ఒక విద్యార్థిని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రైలు ఆలస్యంగా రావడం వల్ల ప్రవేశ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థినికి రూ.9.12 లక్షల భారీ పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ భారతీయ రైల్వేను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బస్తీ (Basti) జిల్లాకు చెందిన సమృద్ధి (Samruddhi) అనే విద్యార్థిని 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే, పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఆమె ‘ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కింది. కానీ, ఆ రైలు నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో సమృద్ధి ఇన్ టైమ్‌లో పరీక్షా కేంద్రానికి చేరుకోలేక ప్రవేశ పరీక్షకు గైర్హాజరు కావాల్సి వచ్చింది. ఫలితంగా ఆమె ఓ అకాడమిక్ ఇయర్‌ను కోల్పోయింది.
రైల్వే శాఖ సర్వీసు వల్లే తన భవిష్యత్తు దెబ్బతిందని భావించిన విద్యార్థి సమృద్ధి, న్యాయ పోరాటానికి సిద్ధమై వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం, విద్యార్థిని వాదనతో కోర్టు ఏకీభవించింది. ‘సూపర్ ఫాస్ట్’ రైలు అని పేరు పెట్టి, అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడంలో విఫలం కావడం ముమ్మాటికీ సేవా లోపమేనని కోర్టు కామెంట్ చేసింది. విద్యార్థిని మానసిక వేదనకు, కోల్పోయిన విద్యా సంవత్సరానికి గాను పరిహారంగా రూ.9 లక్షలు, కేసు ఖర్చుల నిమిత్తం రూ.12 వేలు చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల కోర్టు ఆదేశించింది.






