కాజీపేట్ లోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను తనిఖీ చేసిన రైల్వే బోర్డు చైర్మన్

by Batti.Sumithra |

కాజీపేట్ లోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, చర్లపల్లి టెర్మినల్లలో రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ నిర్వహించారు.

కాజీపేట్ లోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను తనిఖీ చేసిన రైల్వే బోర్డు చైర్మన్
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : కాజీపేట్ లోని రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, చర్లపల్లి టెర్మినల్లలో రైల్వే బోర్డు చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ నిర్వహించారు. జిల్లాకు విచ్చేసిన సతీష్ కుమార్ కు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం కాజీపేట ప్రాంతంలో కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ప్రగతి, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన అంశాల పై సంక్షిప్తంగా చర్చించారు. రైల్వేబోర్డు చైర్మన్ జనగాం అమృత్ స్టేషన్‌ను, ఇరిసెట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తనిఖీ చేశారు. రైలు నిలయంలో అధికారులతో సమగ్ర పనితీరు పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ డా. ఆర్.గోపాలకృష్ణన్, సీనియర్ రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story