- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telugu News > Rahul Gandhi: మాయవతిపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ఆమె వాటికి బయపడిందంటూ ఫైర్
Rahul Gandhi: మాయవతిపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.. ఆమె వాటికి బయపడిందంటూ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికారంపై కీలక వ్యాఖ్యలు- Latest Telugu News

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ''తనకెన్నడూ అధికారంపై ఆసక్తి లేదని.. తాను పుట్టిందే అధికారం మధ్యలోనని'' అన్నారు. కానీ, కొందరు నాయకులు అధికారం కోసం పరితపించిపోతారని ఫైర్ అయ్యారు. వారు ఎప్పుడు దాని కోసం తెగ ఆరాటపడుతుంటారని పేర్కొన్నారు. కాన్షీరాం యూపీలో దళితుల కోసం గొంతెతిత్తే.. మాయవతి మాత్రం దళితుల కోసం నిలబడలేదంటూ విమర్శించారు. ఆమె యూపీలో ఎన్నికల కోసం ఎలాంటి ప్రణాళికలు రచించలేదు.. కూటమి కోసం సంప్రదించిన స్పందిచలేదని ఆరోపించారు. సీబీఐ, ఈడీ, పెగాసస్‌లకు ఆమె బయపడ్డారని తెలిపారు. అందుకే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Next Story






