- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీకి 'అపజయాల సెంచరీ' ఖాయం.. లోక్‌సభలో తేజస్వి సూర్య సెటైర్లు
భారత పార్లమెంట్‌లోని లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత పార్లమెంట్‌లోని లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండి (INDI) కూటమిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, వారి కూటమి ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో 95 సార్లు ఓటమిని చవిచూశాయని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ వారికి పరాజయం తప్పదని, త్వరలోనే రాహుల్ గాంధీ 'అపజయాల సెంచరీ' (100 ఓటములు) పూర్తి చేసుకోబోతున్నారని, ఈ సందర్భంగా తాను ముందస్తుగానే వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లు వేశారు.
మీరు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదు..
ప్రధాని మోడీ నేతృత్వంలో భారత దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమయ్యాయని ఆయన మండిపడ్డారు. ప్రజలు రాహుల్ గాంధీ రాజకీయాలను పదేపదే తిరస్కరిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా విపక్షాలకు పరాభవం తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాహుల్ గాంధీకి, ఇండి కూటమికి ముందస్తుగా అభినందనలు తెలుపుతున్నానని, త్వరలోనే వారు వంద ఓటముల మైలురాయిని చేరుకుంటారని తేజస్వి సూర్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదిలా ఉంటే గతంలోనూ రాహుల్ గాంధీపై ఇటువంటి విమర్శలు చేసిన తేజస్వి సూర్య, తాజా సమావేశాల్లో అపజయాల లెక్కలను ప్రస్తావించడం సభలో దుమారం రేపింది.






