- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాహుల్ గాంధీ దేశ భద్రతకు ప్రమాదకరం: కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ దేశ భద్రతకు ప్రమాదకరంగా మారడంటూ.. కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దేశ భద్రతలకు ప్రమాదమని.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని, దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారారని మండిపడ్డారు. దేశీయంగానే కాకుండా విదేశీ పర్యటనల్లో కూడా రాహుల్.. నక్సలైట్లు, తీవ్రవాదులు, జార్జ్ సోరోస్ వంటి దేశ వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో వరుసగా సమావేశమవుతున్నారని రిజిజు ఆరోపించారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) సైతం రాహుల్ గాంధీపై లోక్‌సభలో అనర్హత వేటు వేయాలని కోరుతూ మోషన్ ప్రవేశపెట్టారు. జార్జ్ సోరోస్ వంటి శక్తుల సహాయంతో రాహుల్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై జీవితకాల నిషేధం విధించాలని దూబే స్పీకర్‌ను అభ్యర్థించిన విషయం తెలిసిందే.






