రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి

by Malleboina Mahesh |   (  Updated:2026-02-27 15:38:00  IST  )

రాహుల్ గాంధీ సూచనలను ప్రధాని మోదీ పెడచెవిన పెడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కరోనా ముప్పును ముందే పసిగట్టినా కేంద్రం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఢిల్లీ కాలుష్యంపై కూడా అదే తీరును ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో కరోనా రావడానికి ముందే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశారని, విదేశాల నుంచి ఇండియా వచ్చే వారిపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారని టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ ​జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ రాహుల్ గాంధీ సూచనలు విన్నారని, కానీ, అమలు చేయలేదని, తర్వాత ఏమైందో మనం అంతా చూశాం..రెండేళ్ల పాటు దేశంలో కరోనా కారణంగా ఇబ్బంది పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం పైన కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతున్నారని, అవసరమైన సూచనలు చేస్తున్నారని జగ్గారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని కాలుష్య నివారణకు రాహుల్ గాంధీ ఇస్తున్న సూచనలను ప్రధానమంత్రి వింటున్నారని, కానీ, అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా దేశ ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు తన సలహాలు, సూచనలు ఇస్తున్నారని, కానీ, వాటిని అమలు చేయడం లో ప్రధాని మోడీ ఫెయిల్ అవుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.

Next Story