గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

by Batti.Sumithra |

గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల గది, ఇంజక్షన్ గది, ఓపీ విభాగం, ఇన్ పేషంట్, ఔట్ పేషెంట్, విభాగాలు, పలు వార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన మందులు, ఓపీ, తదితర రిజిస్టర్లను తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సమయపాలన పాటిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వైద్య సేవలు అందించాలని తెలిపారు.

కేజీబీవీ పాఠశాల తనిఖీ...

అనంతరం కేజీబీవీ వసతి గృహాన్ని పరిశీలించారు. అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ వసతి గృహంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లను పంపిణీ చేశారు.

ఇసుక రవాణా పై...

మోతాక్ పల్లి గ్రామం సుద్ద వాగులో ఇసుక రీచ్ ను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక అక్రమ రవాణా జరగకూడదన్నారు. నిత్యం ప్రత్యేక నిఘా ఉంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వాహనాలను జప్తు చేయాలని ఆదేశించారు. కేవలం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాలు జరగాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే విధంగా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డీఈవో భోజన్న, తహసిల్దార్లు శ్రీకాంత్, ఎంపీడీవో పుష్పలత, ఆసుపత్రి వైద్యాధికారి ప్రమోద్ చంద్ర రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story