ఐనాక్స్ విలీనానికి పీవీఆర్ సంస్థ బోర్డు ఆమోదం!

by Disha Web |
ఐనాక్స్ విలీనానికి పీవీఆర్ సంస్థ బోర్డు ఆమోదం!
X

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ వ్యాపార సంస్థలు పీవీఆర్ లిమిటెడ్(పీవీఆర్), ఐనాక్స్ లీజర్ లిమిటెడ్(ఐనాక్స్) విలీనానికి పీవీఆర్ కంపెనీ బోర్డు ఆదివారం ఆమోదం తెలిపింది. ఐనాక్స్ బోర్డు కూడా దీనికి ఆమోదించింది. ఈ విలీనం ద్వారా ఇరు సంస్థలతో పాటు సంబంధిత వాటాదారులు, ఉద్యోగులు, ఇతరులకు ప్రయోజనాలు లభిస్తాయని పీవీఆర్ సంస్థ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, వ్యాపారానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాపారానికి దోహదం చేస్తుందని, సంబంధిత వాటాదారులు, వినియోగదారులు, ఉద్యోగులతో సహా మిగిలిన వారి విలువ మరింత పటిష్టమవుతుందని కంపెనీ వివరించింది. ఇరు సంస్థల విలీనం మూలంగా జరిగే వ్యాపార వృద్ధి, కొత్త టెక్నాలజీ వినియోగం, విస్తరణ సహా పలు ప్రయోజనాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

ఈ విలీనం ద్వారా సంస్థ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా మారనుందని, ఈ ప్రక్రియ తర్వాత రాబోయే కొత్త సిమిమా స్క్రీన్లు పీవీఆర్ ఐనాక్స్ బ్రాండ్‌గా నిలవనున్నాయని కంపెనీ వివరించింది. దీనికి అజయ్ బిజిలీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సంజీవ్ కుమార్, నాన్-ఎగ్జ్క్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సిద్ధార్థ్ జైన్ నియమించబడనున్నారు. విలీనమైన సంస్థ డైరెక్టర్ల బోర్డులో 10 మంది సభ్యులు ఉండనున్నారు. అదేవిధంగా విలీనం తర్వాత పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది.

Next Story

Most Viewed