యుద్ధం ముగిసినట్టే! : పుతిన్

by Muthe.Rajitha |

నాలుగేళ్లుగా ఉక్రెయిన్ తో జరుగుతున్నా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.

యుద్ధం ముగిసినట్టే! : పుతిన్
X

దిశ, వెబ్ డెస్క్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న భీకర యుద్ధం ఒక కీలక మలుపుకు చేరుకుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా మూడు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించడం, ఇరు దేశాలు చెరో వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం విడుదల చేసుకునేందుకు ముందుకు వచ్చిన సందర్భంగా పుతిన్ ఈ ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ పరిణామం వెనుక అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం చేస్తున్న దౌత్య ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ ఘర్షణ వల్ల అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, ఊహించని స్థాయిలో ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, యుద్ధాన్ని మరింత కాలం పొడిగించడం కంటే ఒక గౌరవప్రదమైన ఒప్పందంతో ముగించడమే శ్రేయస్కరమని ఇరు దేశాల అధినేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పుతిన్ వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ అమలు కావడం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిస్తోంది.

Next Story