- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పుతిన్, నెతన్యాహు డిస్కషన్
ఇరాన్‌లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో చర్చించారు.

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌లో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్‌లో చర్చించారు. ఇరాన్‌లోని ప్రస్తుత పరిస్థితి మాత్రమే కాకుండా మొత్తం మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై వీరు చర్చించారు. ఇరాన్‌లో ఉద్రిక్తతను తగ్గించేందుకు రష్యా మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉందని పుతిన్ నెతన్యాహుకు తెలియజేశారు. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా అన్ని సంబంధిత దేశాలు పాల్గొనే చర్చలు జరిపితేనే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే రష్యా–ఇజ్రాయెల్ మధ్య సంప్రదింపులు, సంబంధాల కొనసాగించాలని ఇరు నేతలు అంగీకరించారు.
ఇరాన్‌లో ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో మొదలైన నిరసనలు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలుగా మారాయి. ఈ నిరసనలపై ప్రభుత్వ అణచివేత చర్యల వల్ల వేలాది మంది అరెస్టు కాగా.., వందలాది మరణాలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో రష్యా ఇరాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండటంతో పాటు, ఇజ్రాయెల్‌తో కూడా సంబంధాలు కొనసాగిస్తోంది. అందుకే పుతిన్ మధ్యవర్తిగా వ్యవహరించాలనే ఉద్దేశంతో నెతన్యాహుతో మాట్లాడినట్లు తెలుస్తోంది.






