- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Matka: వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీలో పుష్ప నటుడు.. ట్రెండింగ్‌లో పోస్టర్
కరుణ కుమార్, వరుణ్ తేజ్(Varun Tej) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’.

దిశ, సినిమా: కరుణ కుమార్, వరుణ్ తేజ్(Varun Tej) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’. పీరియాడిక్ బ్యాక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి(Nora Fatehi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ‘మట్కా’(Matka) సినిమా భారీ అంచనాల నడుమ నవంబర్ 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ వరుస పోస్టర్లు విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా, పుష్ప సినిమా నటుడు అజయ్ ఘోష్(Ajay Ghosh) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాలో ఆయన ‘చిల్లప్ప రెడ్డి’(Chillappa Reddy) పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే ‘‘గోల్డెన్ హార్ట్ అండ్ అచంచలమైన చిత్తశుద్ధితో కూడిన విధేయతతో కూడిన ఆత్మ’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రజెంట్ అజయ్ ఘోష్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్(Social Media)లో ఉంది.
Read More..
Dulquer Salmaan: అలా చూసి నా వైఫ్ నన్ను మిస్ అవుతుంది.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్






