- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pushpa 2: పుష్ప 2 ఐటెమ్ సాంగ్ ఎవరెవరు.. ఏ భాషల్లో పాడారు..?
సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న చిత్రాల్లో మోస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప పార్ట్-2 ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: సినీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న చిత్రాల్లో మోస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప పార్ట్-2 ఒకటి. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల (డిసెంబరు)5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ నేషనల్ క్రష్ రష్మిక హీరో, హీరోయిన్‌గా మెరవనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన పలు అప్డేట్స్ ఇప్పటికే మేకర్స్ వదిలిన విషయం తెలిసిందే. రీసెంట్‌గానే పుష్ప రెండ్ పార్ట్ కు సంబంధించిన ఓ ట్రైలర్ కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇకపోతే ఈ మూవీలో కిస్సిక్ అంటూ సాగే ఐటెమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల మాస్ స్టెప్పులేసి.. ఫ్యాన్స్ కు గూస్‌బమ్స్ తెప్పించింది. తాజాగా ఈ సాంగ్ ను ఏ భాషలో పాడారు అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. అయితే కిస్సిక్ పాటను తమిళం, తెలుగు, కన్నడ.. మూడు భాషల్లో సుబ్లాషిని పాడారట. కానీ హిందీలో మాత్రం సుబ్లాషినితో పాటు లోహితా కూడా పాడిందట. ఇక మలయాళంలో ప్రియా జెర్సన్, బెంగాలీలో సుభాషిని పాడారు. శ్రీలీల అదిరిపోయిన స్టెప్పులేసిన ఈ కిస్సిక్ పూర్తి సాంగ్ నవంబరు రేపు (నవంబరు 24) నైట్ 7 గంటల 2 నిమిషాలకు విడుదల కానుంది.
- Tags
- Pushpa 2






