- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19ఏళ్ల క్రితం కేసులో సింగర్ దలేర్ మెహందీ అరెస్ట్
by S Gopi |
దిశ, సినిమా : ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ ముఖ్యాంశాల్లో నిలిచారు.

X
దిశ, సినిమా : ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ ముఖ్యాంశాల్లో నిలిచారు. గత 19 ఏళ్ల నాటి మానవ అక్రమ రవాణా కేసులో రెండేళ్లు జైలు శిక్షవిధించబడినప్పటికీ.. బెయిల్‌పై బయటపడిన దలేర్‌ను అరెస్ట్ చేయాలని పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఫిర్యాదుదారు తరుపు లాయర్ గుర్మీత్ సింగ్ మాట్లాడుతూ.. '2003లో మానవ అక్రమ రవాణా కేసులో సింగర్ దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. అతన్ని (పోలీసులు) అదుపులోకి తీసుకున్నారు. ప్రొబేషన్‌పై విడుదల కోసం ఆయన చేసిన దరఖాస్తును కూడా కోర్టు కొట్టివేసింది' అని తెలిపారు. ఈ కేసులో దలేర్‌తో పాటు అతని దివంగత సోదరుడు షంషేర్ సింగ్, మరో ఇద్దరు వ్యక్తులపై పాటియాలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Next Story






