- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్‌లో దారుణం..ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబెరాయ్ కాల్చివేత
పంజాబ్ రాష్ట్రంలో దుండగులు ఆమ్ ఆద్మి పార్టీ కీలక నేత ఒబెరాయ్ లక్ష్యంగా కనీసం ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా రాజకీయ పార్టీల నేతల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు, స్థానిక ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి ఈ హత్యలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. పంజాబ్‌లోని జలంధర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత లక్కీ ఒబెరాయ్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం మోడల్ టౌన్‌లోని ఒక గురుద్వారా వెలుపల.. ఒబెరాయ్ తన కారులో గురుద్వారాకు చేరుకున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆయన పై విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు ఏసీపీ పర్మీందర్ సింగ్ తెలిపారు.
అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. దుండగులు ఒబెరాయ్ లక్ష్యంగా కనీసం ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు భారీ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పట్టపగలు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు జలంధర్ పోలీసులు తెలిపారు. రాజకీయ కక్షల వల్ల ఈ హత్య జరిగిందా..? వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో జలంధర్‌లో ఉద్రిక్తత నెలకొంది.






